కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టడమే ప్రస్తుతం నా లక్ష్యం...ఇప్పుడే నాకు సీఎం ఉద్యోగం వద్దు : రేవంత్‌రెడ్డి

  • మహబూబ్‌నగర్‌ ఎన్నికల ప్రచార సభలో స్పష్టీకరణ
  • సభికులు కొందరు సీఎం అంటూ నినాదాలు  
  • ఆద్యంతం కేసీఆర్‌ లక్ష్యంగా మాట్లాడిన రేవంత్‌
ముఖ్యమంత్రి పదవి తన సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టడమే ప్రస్తుతం తన లక్ష్యమని, అప్పుడే తాను సీఎం ఉద్యోగం కోరుకోవడం లేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. వేచి ఉండే ఓపిక, సహనం తనకు ఉన్నాయని చెప్పారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి ఆద్యంతం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారు.

తెలంగాణ యాసలో పంచ్‌ డైలాగులతో సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సభికుల్లో కొందరు 'సీఎం రేవంత్‌' అంటూ నినాదాలు చేయడంతో ఆయన ఇలా స్పందించారు. ముఖ్యమంతి ఉద్యోగం చేయడానికి ఇంకా తనకు సమయం ఉందని, అప్పటి వరకు వేచి ఉండే ఓపిక, సహనం తనకు ఉన్నాయని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Mahabubabad District
Revanth Reddy
KCR

More Telugu News